రోడ్ల పక్కనే నివాసముండే అభాగ్యుల పట్ల ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు ఆ యువకులు. నిలువ నీడ లేక చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నవారికి తమవంతు సాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. గడ్డకట్టుకుపోయే చలిలో రాత్రి పూట రోడ్డు పక్కనే ఉన్న పేదలకు కప్పుకోవడానికి దుప్పట్లు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు చేతన ఫౌండేషన్ సభ్యులు. ఫౌండర్ రవి సాయంతో హైదరాబాద్లో వివిధ సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కూకట్పల్లిలోని జేఎన్టీయూ మొదలుకొని మియాపూర్, శేర్లింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి దుప్పట్లు అందజేశారు.
ఆ యువకులు అభాగ్యులకు ఆపద్బాంధవులు - హైదరాబాద్ తాజా వార్తలు
నిలువ నీడ లేక... గడ్డకట్టుకుపోయే చలిలో రోడ్డు పక్కనే నివాసముంటున్న వారికి ఆపన్నహస్తం అందిచారు ఆ యువకులు. తమకు తోచిన సాయం చేసి ఆ అభాగ్యులకు ఉడత సాయం చేశారు. నిరుపేదలను ఆదుకోవడానికి మానవత్వంతో మరికొంత మంది ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అభాగ్యులకు ఆపద్బాంధవులైన ఆ యువకులు
రోడ్ల పక్కన నివసించే వారికి అందరూ తోచిన సాయం చేయాలంటూ కోరుతున్నారు. తాము ఎన్ని కార్యక్రమాలు చేసినా వారి ఇబ్బందులను తొలగించలేకపోతున్నామని... అందరూ మానవత్వంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Last Updated : Dec 12, 2020, 8:45 AM IST