హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు బాబానగర్ చెరువుకట్ట తెగిపోయింది. దీంతో పాతబస్తీలోని డబీర్‌పురాలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపునకు గురవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
తెగిన చెరువు కట్ట...డబీర్‌పురాలో పోటెత్తిన వరద నీరు - hyderabad old city dabirpura is in under flood water
హైదరాబాద్ భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుణుడి ఉగ్ర రూపానికి చెరువు కట్టలు నూలుదారంలా తెగిపోతున్నాయి. బాబానగర్ చెరువుకట్ట తెగడంతో పాతబస్తీలోని డబీర్‌పురాలో పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెగిన చెరువు కట్ట...డబీర్‌పురాలో పోటెత్తిన వరద నీరు
పలు చోట్ల నాలాల మరమ్మత్తు పనులు చేస్తుండడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. వరద నీరు దిగువకు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతోంది. రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.