తెలంగాణ

telangana

ETV Bharat / state

Chepa Mandu Distribution : అస్తమా పేషెంట్స్​కు అలర్ట్.. మరో రెండ్రోజుల్లో చేప ప్రసాదం పంపిణీ

Fish Prasadam Distribution in Hyderabad : ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా.. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్​లో పంపిణీ చేసే చేప మందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 9వ తేదీన బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేయనున్న చేప మందు ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Chepa Mandu Distribution
Chepa Mandu Distribution

By

Published : Jun 7, 2023, 1:08 PM IST

fish Medicine distribution in Hyderabad :తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఈ నెల 9వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా.. నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Fish Prasadam Distribution in Hyderabad :చేప ప్రసాదం కోసం మూడు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్​కు చేరుకున్న హరియాణా, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారితో మంత్రి మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుండి చేప మందు పంపిణీ జరుగుతుందని.. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర ఏర్పాట్లు చేసేదని.. దాంతో చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Fish Medicine In Hyderabad :బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు 250 మందికి చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారని.. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. చేప ప్రసాదం కోసం వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్ఠమైన బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు.. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Chepa Mandu Distribution in Hyderabad : వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో సరిపడా తాగునీటిని అందుబాటులో ఉంచుతామని.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాపిక్ మళ్లించడం జరుగుతుందన్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్​ల ఏర్పాటుతో పాటు అంబులెన్స్​లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని వివరించారు. ఇక్కడకు వచ్చే వారికి బద్రి విశాల్ పిట్టి, శ్రీకృష్ణ సమితి, అగర్ వాల్ సమాజ్ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తాయని మంత్రి తలసానివివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details