తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికల్లో అన్ని స్థానాలను తెరాస పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఏ ఎన్నికలైనా తెరాసదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమని తెలిపారు.
ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం: బాల్క సుమన్
ఎన్నికలేవైనా విజయం తెరాసదేనని చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గులాబీ మద్దతుదారులే ఏకగ్రీవంగా గెలుచుకున్నారని తెలిపారు.
ఎన్నికలేవైనా గెలుపు తెరాసదే: బాల్క సుమన్
ప్రతి ఎన్నికల్లో గులాబీ పార్టీ సామాజిక సమతూకం అనేది ప్రధానాంశంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో అన్ని వర్గాలకు అవకాశం కల్పించారని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఈనెల 6 నుంచి శాసనసభ సమావేశాలు.. 8న బడ్జెట్..