రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్ దాఖలులో జాప్యంపై ఆగ్రహించింది. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చివేశారని రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయగా... రాష్ట్ర సర్కారు కౌంటర్ దాఖలు చేయలేదు. అనుమతి లేకుండా కొత్త నిర్మాణాలు చేపట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
NGT fire on Telangana govt: రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం - telangana varthalu
18:12 November 25
NGT fire on Telangana govt: రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం
చుట్టుగుంట చెరువు పూడ్చివేతపై ఎన్జీటీ ఆగ్రహం
సూర్యాపేట జిల్లా రాఘవాపురం పరిధిలోని చుట్టుగుంట చెరువు పూడ్చివేతపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు పూడ్చి హైవే నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐకి ఎన్జీటి చెన్నై బెంచ్ నోటీసులు జారీ చేసింది. చెరువు పూడ్చకుండా వంతెన నిర్మించేలా చూడాలని ఆదేశించింది. పూడ్చకుండా నిర్మించే అవకాశాలపై నివేదిక కోరింది. రాఘవాపురంలోని చుట్టుగుంట చెరువును ధ్వంసం చేసి పనులు చేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ గతంలో ఎన్జీటీలో పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి: