తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​లో డ్రోన్ల ద్వారా రసాయనాల పిచికారీ

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ బోర్డు డ్రోన్ల ద్వారా రసాయనాలను పిచికారీ చేసే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో రహదారులపై సోడియం హైపోక్లోరేట్​ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు.

By

Published : Apr 9, 2020, 1:47 PM IST

chemicals was sprayed by drones at secundrabad cantonment board in Hyderabad
సికింద్రాబాద్​లో డ్రోన్ల ద్వారా రసాయనాల పిచికారీ

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా హైదరాబాద్​ సికింద్రాబాద్​ కంటోన్మెంట్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నిత్యం కంటోన్మెంట్​ పరిధిలోని రహదారులను, దుకాణ సముదాయాలు, కాలనీల్లో విస్తృ తంగా రసాయన ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా బస్తీల్లో, కరోనా అనుమానితుల ఇళ్లపై, పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరేట్ ద్రావణాన్ని వెదజల్లుతున్నారు.

కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్, బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, పారిశుద్ధ్య విభాగం అధికారి దేవేందర్ సహా పలువురు కంటోన్మెంట్ సిబ్బంది పిచికారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరుకుగా ఉండే ప్రాంతాల ఇళ్లపై ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి ద్రావణాన్ని చల్లుతున్నట్టు వారు తెలిపారు. డ్రోన్ ద్వారా ప్రయోగాత్మకంగా మొదట కంటోన్మెంట్ బోర్డు వద్ద పిచికారి చేసిన అనంతరం మహేంద్రహిల్స్​లోని రవిసొసైటీ కాలనీలో స్ప్రే కార్యక్రమాన్ని చేపట్టారు.

సికింద్రాబాద్​లో డ్రోన్ల ద్వారా రసాయనాల పిచికారీ

ఇవీచూడండి:కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ABOUT THE AUTHOR

...view details