తెలంగాణ

telangana

ETV Bharat / state

జలాల వినియోగం.. విభజన చట్టంపై సీఎంల సుదీర్ఘ చర్చ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌, సీఎం జగన్‌ హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు.

By

Published : Sep 23, 2019, 4:05 PM IST

Updated : Sep 23, 2019, 9:59 PM IST

cheif-ministers-of-both-states-meet

జలాల వినియోగం.. విభజన చట్టంపై సీఎంల సుదీర్ఘ చర్చ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. లోటస్‌ పాండ్‌ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ భేటీలో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగంపై సీఎంలు చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై సమాలోచనలు చేశారు.

మాంద్యం నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రులు చర్చించారు. ఇద్దరు సీఎంల మధ్య తొలిసారిగా గత జూన్‌ 28న ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఇది మూడోసారి ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఇవీ చూడండి : ఒకే కార్డుపై ఆధార్​, పాస్​పోర్ట్, డ్రైవింగ్​ లైసెన్స్​!

Last Updated : Sep 23, 2019, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details