రాజేంద్రనగర్ సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలిస్తున్నారు. నిన్న జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు.
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రంలో చిరుత? - చిరుత సంచారం వార్తలు
పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎంత వెతికినా కనిపించని చిరుత జాడ... రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం సీసీకెమెరాల్లో నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి చిరుత సంచారం
ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ వర్సిటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత కోసం గాలిస్తున్నారు. గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం వైపు వెళ్లిందనే సమాచారంతో అధికారులు అప్రమత్తమై... గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైతం సూచనలు ఇస్తున్నారు.
Last Updated : May 29, 2020, 11:57 AM IST