తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లి సంబంధం పేరుతో మోసం..ఎన్​ఆర్​ఐ యువకుడికి షాక్ - marriage fraud in tenali

తెలుగు అమ్మాయినని చెప్పింది..అంతేకాదు తల్లిదండ్రులు ఫ్రొఫెసర్లు అని గొప్పలు కొట్టింది. చెన్నైలో స్థిరపడిన కుటుంబమంటూ ప్రగాల్బాలు పలికింది. ఈ వివరాలతో... పెళ్లి కోసం ఓ వెబ్​సైట్​లో పేరు నమోదు చేసుకున్న ఓ ఎన్​ఆర్​ఐ యువకుడిని బురిడీ కొట్టించింది. అంతేకాదు... నగలు, చీరల పేరుతో ఏడు లక్షల రూపాయలను కూడా స్వాహా చేసింది. ఈ మోసం చేసింది అమ్మాయేనా... లేక సైబర్ నేరగాళ్లు అమ్మాయి ఫొటోతో మోసం చేశారా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

పెళ్లి సంబంధం పేరుతో మోసం..ఎన్​ఆర్​ఐ యువకుడికి షాక్
పెళ్లి సంబంధం పేరుతో మోసం..ఎన్​ఆర్​ఐ యువకుడికి షాక్

By

Published : Oct 21, 2020, 11:01 PM IST

పెళ్లి సంబంధం పేరుతో ఎన్ఆర్ఐ యువకుడిని మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలికి చెందిన యువకుడు అమెరికాలో ఉంటున్నారు. వివాహం కోసం ఓ పెళ్లి సంబంధాల వెబ్​సైట్​లో పేరు నమోదు చేసుకున్నాడు. మైనేని సముద్ర అనే యువతి.... యువకుడితో సంప్రదింపులు జరిపింది. తాము చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబమని చెప్పి.... మద్రాసు వెటర్నరీ కళాశాలలో తన తల్లిదండ్రులు ఫ్రొఫెసర్లుగా పని చేస్తున్నట్లు నమ్మించింది.

ఫొటోలు చూసి అమ్మాయి నచ్చటంతో యువకుడు పెళ్లికి సరేనన్నాడు. తెనాలిలో ఉంటున్న తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. పెళ్లి కోసం ఇండియాకు వచ్చాడు. ప్రకాశం జిల్లా ఉలవపాడు తమ స్వగ్రామమని... అక్కడే నిశ్చితార్థమని చెప్పటంతో యువకుడు నమ్మాడు. ఈలోగా నగలు, చీరలు కొనుగోలు పేరుతో యువకుడి నుంచి 7.20 లక్షలు తన అకౌంట్​లో వేయించుకుంది. తన ఏటీఎం కార్డు సమస్య అంటూ కబుర్లు చెప్పింది. ఐదారు విడతలుగా డబ్బులు ఆమె చెప్పిన అకౌంట్లో వేశాడు యువకుడు.

ఇవాళ పెళ్లి చూపుల కోసం అబ్బాయి కుటుంబం ప్రకాశం జిల్లా ఉలవపాడు వెళ్లింది. అక్కడ ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పటంతో అబ్బాయి కుటుంబం అవాక్కయింది. వారి ఫోన్ నంబర్లు పని చేయటం లేదు. దీంతో తాము మోసపోయామని అబ్బాయి కుటుంబం గ్రహించింది. తెనాలికి తిరిగివచ్చి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ చేసిన అకౌంట్ వేరే వారి పేరుతో ఉండటంతో సైబర్ నేరగాళ్లు ఏమైనా అమ్మాయి ఫొటోలు పెట్టి ఇలా మోసం చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details