రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకంలో ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 40 మందిని మోసం చేసి.. ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి 1.5 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విజన్ వన్ టీవీ ఛానల్ ఎండీ అంటూ చెప్పుకుని మోసాలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందికి టోకరా - man arrested in double bed house case
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందిని మోసం ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గతంలో నకిలీ ఐడీ కార్డు సృష్టించి ఎస్సైగా చెలామణి అయినట్లు పోలీసులు తెలిపారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందికి టోకరా
నిందితుడు గట్టుల ప్రశాంత్ గతంలో నకిలీ ఐడీ కార్డులతో ఎస్సైగా చలామణి అయ్యాడని తేలింది. ఈ కేసులో విజయవాడలో అరెస్ట్ అయి ఇటీవలే విడుదల అయినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ. 8లక్షల నగదు, నకిలీ ఇళ్ల డాక్యుమెంట్లు, వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.