ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిని హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బల్కంపేటకు చెందిన ఓ యువతి, ఏపీలోని కాకినాడకు చెందిన వెంకట సురేశ్ కుమార్ కొద్ది రోజులగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం తీసుకొని ఉడాయించాడు.
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. మోజు తీరిన తర్వాత..? - హైదరాబాద్లో ప్రేమ పేరుతో మోసం
నువ్వంటే నాకిష్టమన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను నీతోనే జీవితమన్నాడు. అమ్మాయిని ప్రేమలో దించి అవసరం తీరిన తర్వాత మొహం చాటేశాడు. పెద్దమొత్తంలో నగదు, బంగారంతో ఉడాయించిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. మోజు తీరిన తర్వాత..?
విషయం గ్రహించిన బాధితురాలు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతడికి సహకరించిన బంధువులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి:'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'