తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగం వచ్చిందన్నారు.. రూ.27 వేలు దోచుకున్నారు.! - KOTAK MAHINDRA, HYDERABAD

ఉద్యోగం వచ్చిందన్నారు. ఆ ఉద్యోగం కావాలంటే రూ.27 వేలు కట్టాలన్నారు. ఉద్యోగంపై ఆశతో అడిగిన సొమ్మును దుండగులకు బదిలీ చేసిన హైదరాబాదీ యువకుడు.. వారి అసలు రంగు తెలుసుకుని లబోదిబోమంటున్న ఘటన హైదరాబాద్​లో చోటు చేసుకుంది.

ఉద్యోగం పేరిట రూ.27 వేలు దోచిన ఆర్థిక నేరగాళ్లు
ఉద్యోగం పేరిట రూ.27 వేలు దోచిన ఆర్థిక నేరగాళ్లు

By

Published : May 3, 2020, 11:43 PM IST

హైదరాబాద్​లో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటర్వ్యూ ఫీజుల పేరుతో ఓ యువకుడిని మభ్యపెట్టి రూ.27 వేలు దోచుకుని మోసం చేశారు. కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్‌ దూద్‌బౌలికి చెందిన యువకుడికి తొలుత ఫోన్‌ చేశారు. ప్రోసెసింగ్, ఇంటర్వ్యూ ఫీజుల కోసం రూ.27 వేలను ఖాతాకి పంపాలని కోరగా మనీష్ బదిలీ చేశాడు. అనంతరం ఎంతకీ స్పందించకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details