ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం, దేశ సంరక్షాణార్థం చతుర్వేద హవనం నిర్వహించారు. కొండపైన చిన్నరాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. చతుర్వేద హవనాన్ని ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, చింతపల్లి ఆంజనేయ, ప్రధానార్చకులు లింగంబొట్ల దుర్గాప్రసాద్ తదితరులు నిర్వహిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై ఐదు రోజులపాటు చతుర్వేద హవనం
లోక కల్యాణార్థం, దేశ సంరక్షణార్థం ఇంద్రకీలాద్రిపై చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కర్ణాటకలోని హంపి పీఠాధిపతులు విరూపాక్ష స్వామీజీ హాజరయ్యారు. చతుర్వేద హవనంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచానము, పంచగవ్య ప్రాసన, రుత్విక్ వరుణ, గోపూజ, యాగశాల ప్రవేశం, చతుర్వేద మండపారాధన, బ్రహ్మకలశ స్థాపన, అఖండ దీప ప్రజ్వలన, అగ్నిప్రతిష్ఠాపన, చతుర్వేద పారాయణ, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో సురేశ్ బాబు, పాలకమండలి సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?