హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ తెదేపా అభ్యర్థి పెద్దమార్ రాజేష్ పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
రాష్ట్రం వచ్చినా కష్టాలు తప్పలేదు: తెదేపా అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
తెలంగాణ వస్తే ప్రజలందరూ బాగుపడతారని అనుకున్నామని.. కానీ ఇప్పటికీ ఇబ్బందులు తప్పటం లేదని చైతన్యపురి డివిజన్ తెదేపా అభ్యర్థి పెద్దమార్ రాజేష్ అన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రం వచ్చినా కష్టాలు తప్పలేదు: తెదేపా అభ్యర్థి
తెలంగాణ వచ్చినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదన్నారు. నగరం పరిస్థితి చాలా ఘోరంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో అవినీతి, అరాచకమే ఉందన్నారు. తాను గెలిస్తే డివిజన్ అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... నగరవాసిపై వరాల జల్లు