లాక్డౌన్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పార్థనలకు అనుమతి లేకపోవడం వల్ల చార్మినార్, మక్కా మసీద్ పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. రంజాన్ నిర్వహణపై ఉన్నతాధికారులు, పోలీసులు ఆయా మత పెద్దలుకు ముందుగానే సూచనలు చేశారు. మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
లాక్డౌన్ వేళ... రంజాన్ ఇలా.. - రంజాన్ సందర్భంగా చార్మినార్ వద్ద పరిస్థితి
రంజాన్ రోజున కోలాహలంగా కనిపించే పాత బస్తీ పరిసర ప్రాంతాలు వెలవెల బోయాయి. కరోన ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు జరుపుకుంటున్నారు. చార్మినార్, మక్కామసీద్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
లాక్డౌన్ వేళ... రంజాన్ ఇలా..
పాత బస్తీ పరిసరాల్లో పరిస్థితిని లా అండ్ ఆర్డర్ అదపు సీపీ డీఎస్ చౌహాన్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ పర్యటించి పరిస్థితిపై ఆరా తీశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించ కుండా ప్రార్థనలు చేసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు