ఆకలితో అలమటిస్తోన్న నిరుపేదలకు.. పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతోన్న పేదలను ఆదుకుంటున్నాయి. నగరంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు, ఫూట్‌పాత్‌లపై జీవనం సాగిస్తోన్న వారికి.. పదం చంద్ అనే స్వచ్ఛంద సంస్థ భోజనం ప్యాకెట్లను అందజేసి మానవత్వాన్ని చాటుకుంటోంది.
నిరుపేదలకు అండగా నిలుస్తోన్న స్వచ్ఛంద సంస్థలు
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు.. మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో, ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోన్న వారికి పదం చంద్ అనే స్వచ్ఛంద సంస్థ భోజనం ప్యాకెట్లను పంపిణీ చేసి ఆదుకుంటోంది.
food distribution
నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో.. 200 మంది రోగులు వారి సహాయకులకు, నాంపల్లిలో ఫుట్‌పాత్‌లపై ఉంటోన్న వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు సంస్థ సభ్యులు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:కేంద్రం వల్లే వ్యాక్సినేషన్ జాప్యం : మంత్రి హరీశ్