అభాగ్యులకు ఆక్సిజన్: ప్రాణాలు నిలిపేందుకు చేతులు కలిపారు
ఆక్సిజన్! ఇప్పుడు దేశంలో ప్రతిమూల ఈ ప్రాణ వాయువు గురించే చర్చ. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా నుంచి బయటపడాలంటే ఆక్సిజనే ఆధారమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొవిడ్ రోగులు.. ప్రాణవాయువు అందక అల్లాడిపోతున్నారు. కొందరు సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు, అభాగ్యులకు ఆక్సిజన్ అందించి ప్రాణం నిలిపేందుకు చేతులు కలిపాయి... సోషల్ డేటా ఇన్‌షేటివ్స్ ఫోరం, యాక్సెస్ ఫౌండేషన్, సఫియా బైత్వాల్ మాల్ స్వచ్చంద సంస్థలు. ప్రభుత్వఆస్పత్రుల వద్ద ఉచితంగా ప్రాణ వాయువు అందిస్తూ వందలాది ప్రాణాలు కాపాడుతున్నారు. గతేడాది నుంచి కలిసికట్టుగా కృషి చేస్తూ కరోనా బాధితులను ఆదుకుంటున్న ఆ స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఆక్సిజన్