చట్ట విరుద్ధమైన చర్యలను నిరోధించకపోవటంతో ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె రూరల్ సీఐ, పట్టణ ఎస్సైకి ఎస్పీ విశాల్ గున్ని ఛార్జ్ మెమో జారీ చేశారు. తీర ప్రాంతాల్లో కోడి పందేలు, పేకాట నిర్వహణ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చెయ్యలేకపోతున్నారని.. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం అందించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
చట్ట వ్యతిరేక చర్యలు నిరోధించలేదని సీఐ, ఎస్సైకు ఛార్జ్ మెమో
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిరోధించటంలో విఫలమైనందుకు గుంటూరు జిల్లా రేపల్లె రూరల్ సీఐ, ఎస్సైకు ఎస్పీ ఛార్జ్ మెమో జారీ చేశారు. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా వారిని కోరారు.
చట్ట వ్యతిరేక చర్యలు నిరోధించలేదని సీఐ, ఎస్సైకు ఛార్జ్ మెమో
సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వాసుకు పంపిన మెమోలపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి:టాలీవుడ్ స్టార్స్.. అభిమానులకు 'న్యూ ఇయర్' విషెస్