ఇంటర్ పరీక్ష విధానంలో పలు మార్పులకు... ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రశ్నాపత్రంలో చాయిస్‌లు పెంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.
ప్రశ్నాపత్రంలో మార్పులకు ఇంటర్‌బోర్డు కసరత్తు
కరోనా పరిస్థితుల వల్ల పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాట్లు కల్పించేలా ప్రశ్నాపత్రం రూపొందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మరిన్ని చాయిస్‌లు ఇవ్వనుంది. ఏయే సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు చాయిస్ ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తోంది.
ఇంటర్ ప్రశ్నపత్రంలో మార్పులకు ఇంటర్‌బోర్డు కసరత్తు
సర్కారు నుంచి అనుమతిస్తే... కళాశాలలు ప్రారంభించేలా బోర్డు సమాయత్తం అవుతుంది. సంక్రాంతి తర్వాత షిఫ్టు పద్ధతిలో.. కళాశాలలు ప్రారంభించేలా బోర్డు సన్నద్ధం అవుతోంది.
ఇదీ చదవండి:ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణం రేపే..!