చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే, పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి ఆరోగ్యం మెరుగుపడింది. గతంలో దాడి నేపథ్యంలో అనారోగ్యానికి గురైన ఆయన లండన్‌లో 45 రోజులపాటు చికిత్స పొందారు. ఇవాళ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున అక్బరుద్దీన్ రాకతో అభిమానులు, కార్యకర్తలతో శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అక్బర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు.
హైదరాబాద్ చేరుకున్న అక్బరుద్దీన్ ఒవైసి - Akbaruddin Owaisi health
ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి ఇవాళ ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. లండన్‌లో 45 రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు.
Akbaruddin Owaisi
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST