నగరంలోని పాతబస్తీ లాల్ దర్వాజాలోని నాగుల్‌చింతలో ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో చంద్రయాన్ 2 ఉపగ్రహం ఆకారంలో తయారుచేసిన వినాయకుణ్ని ప్రతిష్ఠించారు. ఇటీవల ఇస్రో పంపిన చంద్రయాన్ 2 ఉపగ్రహం స్ఫూర్తితో ప్రతిష్ఠించామని నిర్వాహకులు తెలిపారు. విగ్రహం చుట్టూ బ్యానర్లతో ఏర్పాటుచేసిన అంతరిక్షం నమూనా చూపరులను ఆకట్టుకుంటుంది. ఉపగ్రహం ఎత్తు 23.5 అడుగులు కాగా అందులో కొలువైన గణేశుడి ఎత్తు 5 అడుగులు.
లాల్‌దర్వాజాలో కొలువైన చంద్రయాన్ 2 గణేశుడు - ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ '
హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజాలో ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో చంద్రయాన్ 2 వినాయకుడిని ప్రతిష్ఠించారు.
![లాల్‌దర్వాజాలో కొలువైన చంద్రయాన్ 2 గణేశుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4368421-1078-4368421-1567858415200.jpg)
లాల్‌దర్వాజాలో కొలువైన చంద్రయాన్ 2 గణేశుడు