ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్న చంద్రబాబు..దుర్ఘటనపై సత్వరమే స్పందించి చర్యలు చేపట్టినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు.
గ్యాస్ లీకేజిపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలన్నారు. లీకైన వాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతుందని...స్టైరీన్‌తో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు చెబుతున్నాయని చంద్రబాబు అన్నారు.