కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి నివాసానికి వచ్చిన చంద్రబాబు... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ పరామర్శించారు.
జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు