తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పటంలో కాదు.. ముందు అక్కడ రోడ్లు వేయండి: చంద్రబాబు - ఏపీ తాజా వార్తలు

CBN Tweet on Roads: ఇప్పటంలో కాదు.. ముందు జగనన్న కాలనీలకు వెళ్లే మార్గంలో రోడ్డు వేయండని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Cbn Tweet on Roads
Cbn Tweet on Roads

By

Published : Nov 7, 2022, 12:45 PM IST

CBN Tweet on Roads: ఆంధ్రప్రదేశ్​లోని ఇప్పటంలో కాదు.. ముందు జగనన్న కాలనీలకు వెళ్లే మార్గంలో రోడ్డు వేయండని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఏపీ కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెంలోని జగనన్న కాలనీలో రోడ్ల దుస్థితిని తెలిపే వార్తను చంద్రబాబు ట్వీట్‌ చేశారు. జగనన్న కాలనీ లబ్ధిదారులకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. చదును చేసేందుకు లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని చోట రహదారి అభివృద్ధిని విస్మరించటంపై మండిపడ్డారు. ట్రాక్టర్ కూడా వెళ్లలేని దారుణ రోడ్డు పరిస్థితిని ముందు మార్చండి అంటూ.. ప్రభుత్వానికి చురకలు అంటించారు.

ABOUT THE AUTHOR

...view details