తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్ ముంపు బాధితులకు అండగా నిలవండి' - chandrababu comments on hyderabad floods

భాగ్యనగరంలో వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తెదేపా కార్యకర్తలు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్​ వేదికగా పేర్కొన్నారు.

'హైదరాబాద్ ముంపు బాధితులకు కార్యకర్తలు అండగా నిలవండి'
'హైదరాబాద్ ముంపు బాధితులకు కార్యకర్తలు అండగా నిలవండి'

By

Published : Oct 20, 2020, 3:40 PM IST

హైదరాబాద్​లో అవసరమైనచోట తెదేపా కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

జలప్రళయం తగ్గే వరకు భాగ్యనగర వాసులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరికి వారు సురక్షితంగా ఇళ్లలోనే ఉండి కుటుంబసభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి :తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్

ABOUT THE AUTHOR

...view details