Chandrababu Tested Corona Positive: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం వైరస్ స్వల్ప లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. కొవిడ్ నిర్ధరణతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Chandrababu Tested Corona Positive: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ - ఏపీలో కరోనా వార్తలు
08:18 January 18
Chandrababu Tested Corona Positive: కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చంద్రబాబు వెల్లడి
అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఉండవల్లిలోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. తనను కలిసివారు సైతం కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని... మాస్క్‌లు ధరించాలని సూచించారు. సోమవారం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కొవిడ్ నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.
స్పందించిన సీఎం జగన్..
చంద్రబాబుకు కరోనా సోకటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చంద్రబాబు వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:Lokesh letter to cm jagan: 'పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. సెలవులు పొడిగించండి'