తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా?: చంద్రబాబు

ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్​మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది.. తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Dec 23, 2022, 10:50 PM IST

ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా? అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ చర్యల వల్ల అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఫైనాన్షియల్‌, టూరిజం హబ్‌గా మారాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజాం నుంచి టెక్కలి, తెర్లాం, గొల్లపల్లి వరకు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు.

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్​మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని.. వారి విషయంలో ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. వైకాపా పాలనలో రైతులు ఆనందంగా లేరంటూ ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదనీ.. వారికి గిట్టుబాటు ధరను కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా చితికిపోయారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం సమయంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. నాయకత్వంలోనూ మహిళలు పోరాడాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.

తెలుగువారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. అది తెలంగాణ అయినా.. అమెరికా అయినా.. ఎక్కడైనా తెలుగువారి కోసం నేను అండగా ఉంటాను. తెలుగు వారి కోసమే తెలుగు దేశం పార్టీ పుట్టింది. విశాఖకు వచ్చే పరిశ్రమలు పారిపోయాయి. మూడు రాజధానుల పేరుతో జగన్​మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖ ఫైనాన్షియల్‌, టూరిజం హబ్‌గా మారాలని కోరుకుంటూన్నాను. జాబ్ రావాలంటే ఏం కావాలో చెప్పండి. రైతులు పండించిన పంటకు సకాలంలో డబ్బులు అందిస్తున్నారా? రైతు సమస్యలపై నేను ప్రశ్నిస్తా. -చంద్రబాబు, టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details