ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల తీరుపై తెదేపా నేత చంద్రబాబు ఆరా తీశారు. పలువురు నేతలు, కార్యకర్తలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు మండలాల్లో సర్పంచి, వార్డు స్థానాల్లో పార్టీ తరఫున అభ్యర్థుల గెలుపు, ఓటములపై వివరాలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి కారణాలను స్థానిక ముఖ్య నేతలు వివరించారు. త్వరలోనే కుప్పం పర్యటనకు వస్తానని చంద్రబాబు తెలిపినట్లు స్థానిక నేతలు వెల్లడించారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మునిరత్నం, నేతలు మనోహర్, ఆంజినేయరెడ్డి, మునస్వామి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనం
ఎస్సీలపై రాళ్లదాడి జగన్ ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ పెదకూరపాడు నియోజకవర్గం లింగాపురంలో ఎస్సీలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.