CBN On Paravada Reacted Industry Accident: ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త తనని కలచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మృతులందరూ 35 ఏళ్ల లోపు వారు కావడం మరీ విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పరవాడ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: చంద్రబాబు - లారెస్ ల్యాబ్ ప్రమాదం
CBN On Paravada Reacted Industry Accident: ఏపీలోని పరవాడ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన వార్త కలచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పరిశ్రమల భద్రత విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు నిత్యం తనిఖీలు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు
తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల్లో భద్రత విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు నిత్యం తనిఖీలు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
TAGGED:
Paravada Industry Accident