ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో వైద్యుడు సుధాకర్‌పై దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. సుధాకర్‌ను కొట్టినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్లు చేసి బెదిరించిన వారిని, దాడి చేసినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. వైద్యుడి చేతులు కట్టేసి, లాఠీలతో కొట్టడం హేయమైన చర్య అన్నారు. ప్రశ్నించే వ్యక్తులందరినీ ఇలాగే హింసిస్తారా అని ప్రశ్నించారు.
వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు - విశాఖలో సుధాకర్ అరెస్టును ఖండించిన చంద్రబాబు వార్తలు
విశాఖలో వైద్యుడు సుధాకర్‌పై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఆయనపై దాడిని ఎస్సీ, వైద్యవృత్తిపై దాడిగా చంద్రబాబు పేర్కొన్నారు.
![వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు babu respond on doctor issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7227174-381-7227174-1589639095344.jpg)
వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు
డాక్టర్ సుధాకర్ పరిస్థితికి సీఎం జగనే కారణమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్యుడిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను అందరూ వ్యతిరేకించాలన్నారు. డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో దారుణం..డాక్టర్‌ను కట్టేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
Last Updated : May 17, 2020, 1:46 PM IST