తెలంగాణ

telangana

By

Published : Feb 2, 2023, 10:59 PM IST

ETV Bharat / state

'రాజకీయ నాయకుల కంటే ధనికుడైన జగన్.. పేదల గురించి మాట్లాడడం హస్యాస్పదం'

Chandrababu about YS Viveka Case: ఏపీలోని వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీఎం జగన్ ఇప్పుడు ఇక తప్పించుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్​లు ట్యాప్ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

tdp chief chandra babu
టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu Naidu key comments: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో సీఎం జగన్ ఇప్పుడు ఇక తప్పించుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్​లోని ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ నిర్వహణ, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్​తో పాటు పలు అంశాలపై నియోజకవర్గ ఇంచార్జ్​లు, ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు జీవో నెంబర్ 1 తేవడం, రాజకీయ పక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు తప్ప ముఖ్యమంత్రికి రాష్ట్రం గురించి పట్టడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

కర్ణాటక రాష్ట్రం తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని తెలిపారు. ఈ విషయంలో జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్​కు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ అడుగడుగునా రాజీ పడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. వైసీపీ ఎంపీలు పనిచేసేది సొంత లాబీయింగ్ కోసమే కానీ.. రాష్ట్రం కోసం కాదని దుయ్యబట్టారు.

వైసీపీ వల్లే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరువు జిల్లాలకు నిధులు సహా ఒక్క అంశంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో అందరు రాజకీయ నాయకుల కంటే ధనికుడైన జగన్.. పేదల గురించి మాట్లాడడం హస్యాస్పదం బాబు ఉందన్నారు. జగన్ స్కీం పెట్టాడు అంటే అందులో సొంత స్కాం ఉంటుందని ఆరోపించారు.

జె బ్రాండ్స్ మద్యం, ఇసుక విధానం అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజలను నిత్యం దోచుకుంటూ, ఎన్నికలు వస్తున్నాయని పేదల గురించి చెపితే జనం నమ్మరని చంద్రబాబు తెలిపారు. పార్టీ నేతలు రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వైసీపీ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఏప్రిల్ 15 వరకు ఇదేం ఖర్మ కార్యక్రమం పూర్తి చెయ్యాలని ఇంచార్జ్ లకు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details