తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకాపా నేతల రౌడీయిజం నా వద్ద సాగదు: చంద్రబాబు - విజయవాడ మున్సిపల్ ఎన్నికలపై చంద్రబాబు కామెంట్స్

వైకాపా నేతల రౌడీయిజం తన వద్ద సాగదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పేకాట మంత్రి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నానని... వైకాపాకు భయపడి కాదని స్పష్టం చేశారు.

వైకాపా నేతల రౌడీయిజం తన వద్ద సాగదు: చంద్రబాబు
వైకాపా నేతల రౌడీయిజం తన వద్ద సాగదు: చంద్రబాబు

By

Published : Mar 7, 2021, 9:03 PM IST

ఏపీ రాజధానిగా అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపాకు ఓటు వేస్తే 3 రాజధానులకు మద్దతు తెలిపినట్లవుతుందని స్పష్టం చేశారు. చైతన్యానికి మారుపేరు విజయవాడ అని గుర్తు చేశారు. ఎన్నో కమ్యూనిస్టు ఉద్యమాలు విజయవాడ గడ్డపై జరిగాయన్నారు. మూడు ముక్కలాట పేరుతో జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ గాంధీహిల్‌ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ముందు తిరిగిన జగన్‌ ఇప్పుడెందుకు తిరగడం లేదు. జగన్‌ మాయలో పడి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారు. ఏబీసీడీ పాలసీని ఏపీ అంతా అమలు చేయాలని చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు తిన్న నేతకు పాపభీతి లేదు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నోట్లు ఇస్తారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:ఎవరు ఎవర్ని ఆదుకుంటున్నారో అర్థమవుతోంది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details