Chandrababu comments Palnadu SP: పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైసీపీ అరాచక శక్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. అరాచక శక్తులకు అండగా ఉన్న ఎస్పీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో ఆయన పనిచేసే కార్యాలయంలోని హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అధికారులతో పోలీసు విభాగానికే తలవంపులని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు ఎస్పీని వెంటనే తొలగించాలి: చంద్రబాబు - పల్నాడు తాజా వార్తలు
Chandrababu comments Palnadu SP: ఏపీలోని పల్నాడు జిల్లా ఎస్పీ తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఎస్పీ స్థానంలో హోంగార్డును పెట్టినా సమర్థంగా విధులు నిర్వహించేవారని అన్నారు.
చంద్రబాబు నాయుడు
Last Updated : Dec 18, 2022, 5:08 PM IST