తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా: చంద్రబాబు

CBN MEETING WITH PARTY LEADERS: ఓడిపోతారని తెలిసే జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏపీలోని కర్నూలు జిల్లాలోని తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్​ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కుప్పంలో తెదేపా ఆఫీసుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా: చంద్రబాబు
ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా: చంద్రబాబు

By

Published : Nov 18, 2022, 6:46 PM IST

CBN FIRES ON YSRCP: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో తెదేపా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అన్న బాబు.. పోలీసులు యూనిఫాం తీసేయండని సూచించారు. ఎస్పీ ఎవరిని కాపాడుతున్నారు.. ఐపీఎస్ ఎందుకు చదివినట్లు అని ప్రశ్నించారు. కుప్పంలో తెదేపా ఆఫీసు జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కర్నూలులో బెంచ్ పెట్టాలని తనే చెప్పినట్లు తెలిపారు.

ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా: చంద్రబాబు

ఓడిపోతారని తెలిసే జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. పేటీఎం బ్యాచ్‌కు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రెచ్చగొట్టి పంపారని.. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా అని హెచ్చరించారు. రాజకీయ రౌడీలను అణచివేయడం తనకు కష్టం కాదని తెలిపారు. ఆడబిడ్డల పట్ల ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెదేపాలోకి చేరిన వైకాపా కార్యకర్తలు: వైకాపా అరాచక పాలనను ఎదుర్కోవడానికి కార్యకర్తలందరూ ఏకమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్న ఆయన.. నేడు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మౌర్య ఇన్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో.. 2 వేల మంది వైకాపా కార్యకర్తలు.. తెలుగుదేశంలోకి చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వెనుకబడిన వర్గాల ప్రజలను విడగొట్టి.. రాజకీయంగా లాభపడాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అందరూ ఏకమై.. జగన్‌ ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: కర్నూలు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు తనని ఆదరించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా నడుస్తోందని.. వైకాపా నాయకులంతా మాఫియాగా మారారని విమర్శించారు. రాష్ట్రానికి ఎన్ని రాజధానులు కావాలి? ఒకటి సరిపోదా? అని ప్రశ్నించారు. 50 ఫెడరేషన్లు పెట్టి ఛైర్మన్లను పెట్టారు కానీ.. వారికి జీతాల్లేవు.. కుర్చీలు లేవని మండిపడ్డారు. ఏ2 విశాఖను దోచేస్తున్నారన్న బాబు.. 50 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. రేపటి నుంచి కార్యకర్తలు బాగా పనిచేయాలని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details