తిరుపతి ఉపఎన్నిక, సీఐడీ నోటీసుల పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణపై .. తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరుగుతున్నందున తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నేతలతోనూ చర్చించనున్నారు.
ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశం - ap news
ఏపీలో పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి నేతలతో చర్చలు జరిపారు. సీఐడీ నోటీసులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణపై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై చర్చించనున్న చంద్రబాబు.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.
ముఖ్య నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశం
పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం జరిపి లోటుపాట్లపై చర్చించనున్నారు.