ఏపీ డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జనభేరి సందర్భంగా 600 మందికి పైగా తెదేపా నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అణచివేత విచ్చలవిడిగా సాగుతోందని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడే బదులు కొందరు పోలీసులు ప్రాథమిక హక్కులను అణచివేయడంపైనే శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు.
ఆ నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: చంద్రబాబు - ap news
ఏపీలో శాంతిభద్రతలు కాపాడాల్సిన కొందరు పోలీసులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమే పనిగా పెట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు. జనభేరి సభ సందర్భంగా 600 మందికిపైగా తెదేపా నేతలకు నోటీసులు జారీ చేయడమేంటని ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల స్ఫూర్తిని దెబ్బతీసేలా పోలీసుల చర్యలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఆ నోటీసులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: చంద్రబాబు
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కొందరు పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కవటం విచారకరమని లేఖలో స్పష్టం చేశారు. తెదేపా నేతలకు జారీ చేసిన నోటీసులే ఇందుకు నిదర్శనమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కారాదు, ఏ కార్యక్రమంలోను పాల్గొనరాదంటూ ఆ నోటీసుల్లో హెచ్చరించని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), 19(1)(బి), 19(1)(డి) స్ఫూర్తిని కాలరాసేలా పోలీసుల నోటీసులు ఉన్నాయని మండిపడ్డారు.
ఇదీ చదవండి:ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం