CBN Letter To DGP: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో సాధారణంగా ఫిర్యాదుదారులు పోలీసులు లేదా స్థానిక రెవెన్యూ అధికారులు ఉంటున్నారని ఫిర్యాదుదారు సిద్ధంగా ఉండి, నిందితుల జాబితాలో పాటు ఎఫ్‌ఐఆర్‌లో ‘ఇతరులను’ చేర్చుతున్నారని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 307 లేదా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సెక్షన్లు పెడుతున్నారని విమర్శించారు.
టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ - TDP President Chandrababu
CBN Letter To DGP : ఏపీలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి వివిధ సెక్షన్ల విషయంలో తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు.
Chandrababu
ఏపీలో మాచర్ల, కుప్పం, తంబళ్లపల్లె, తదితర ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్ నం.2/2023లో పేర్కొన్న రెవెన్యూ అధికారి ఫిర్యాదులో టీడీపీ నేతలపై మాత్రమే కఠినమైన సెక్షన్లు పెట్టారని.. వైసీపీ నేతలపై సాధారణ సెక్షన్లతో నామమాత్రపు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తించకుంటే, రాబోయే కాలంలో అలాంటి పోలీసులను చట్ట ప్రకారం శిక్షిస్తారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇవీ చదవండి: