తెలంగాణ

telangana

ETV Bharat / state

CBN LETTER TO DGP: హత్యకేసులో సాక్షులకు బెదిరింపులు... డీజీపీకి చంద్రబాబు లేఖ - ap news

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో జూన్‌ 17న నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. సాక్షుల్ని బెదిరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదని... బాధితుల కుటుంబ సభ్యులు, సాక్షులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు.

CBN LETTER TO DGP: హత్యకేసులో సాక్షులకు బెదిరింపులు... డీజీపీకి చంద్రబాబు లేఖ
CBN LETTER TO DGP: హత్యకేసులో సాక్షులకు బెదిరింపులు... డీజీపీకి చంద్రబాబు లేఖ

By

Published : Aug 1, 2021, 3:26 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లాలో జూన్‌ 17న జరిగిన జంట హత్యల కేసులో సాక్షుల్ని బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జూన్ 17న వడ్డు నాగేశ్వర్​రెడ్డి, వడ్డు ప్రతాప్​రెడ్డిలను వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వారి సోదరుడు మోహన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి శ్మశానవాటికకు వెళ్లినప్పుడు వైకాపా నాయకులు వారిని హత్య చేశారని ధ్వజమెత్తారు.

ఇలాంటి హింసాత్మక చర్యలకు సమాజంలో చోటు ఉండకూడదన్నారు. నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బాధితుల కుటుంబ సభ్యులను, సాక్షులను... దోషులు ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:CHANDRA BABU: 'అవినీతిని అడ్డుకుంటే దాడులు చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details