తెలంగాణ

telangana

ETV Bharat / state

గోయల్ జీ.. విశాఖకు నిపుణులను పంపండి: చంద్రబాబు - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ

ఏపీలోని విశాఖలో గ్యాస్ లీకేజ్ కారణంగా అనారోగ్యానికి గురైన వారికి నిపుణులైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు.

chandrababu letter to piyush goyal on vizag incident
గోయల్ జీ.. విశాఖకు నిపుణులను పంపండి: చంద్రబాబు

By

Published : May 7, 2020, 5:13 PM IST

ఏపీలోని విశాఖ గ్యాస్ లీక్‌ ప్రమాదంపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గ్యాస్ లీక్ వల్ల సుమారు 2 వేల మంది అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. బాధితుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓ వైపు కరోనా బాధితులు, మరోవైపు విషవాయువువల్ల అనారోగ్యం పాలైనవారు ఉన్నందున నిపుణులైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

ఇదే సమయంలో పశువులు కూడా అనారోగ్యం పాలైనందున వెటర్నరీ వైద్యులను పంపాలని విన్నవించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. పరిశ్రమను కాలుష్యం లేని ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)కి తరలించాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిపుణులను పంపించాలన్నారు.

ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ABOUT THE AUTHOR

...view details