ఏపీకి జరుగుతున్న అన్యాయం చూసి పొట్టిశ్రీరాములు ఆత్మ కూడా క్షోభిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 4 నిర్వహించటమే సబబుగా పేర్కొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా అదనపు ఆదాయం వచ్చే విధంగా అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు. భాజపా కూడా ఉద్యమానికి సహకరిస్తూ మోదీ కూడా సానుకూలమని ప్రకటించారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పోతోందని.. ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని లేకుంటే ప్రజాగ్రహం ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేస్తే... పొట్టి శ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేశారన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములు నాంది పలికారని, త్యాగానికి మారుపేరుగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు.