తెలంగాణ

telangana

క్షుద్ర రాజకీయాల నుంచి.. వైకాపా బయటికి రాదా?: చంద్రబాబు

By

Published : Nov 12, 2022, 4:48 PM IST

CHANDRABABU FIRES ON CM JAGAN: ఆంధ్రప్రదేశ్​లో వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో తెదేపా కార్యాలయాన్ని ఖాళీ చేయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైకాపా బయటికి రాదా అని ప్రశ్నించారు.

chandrababu
chandrababu

CHANDRABABU FIRES ON CM JAGAN: తగులబెట్టడం, కూలగొట్టడం వంటి సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైకాపా ఇంక బయటకు రాదా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు.. వైకాపా రాక్షస రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. పుంగనూరులో తెదేపా కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయించడానికి స్వయంగా ఎస్పీ బలగాలతో వెళతారా అని నిలదీశారు.

ఐపీఎస్​కు మీరు అర్హులేనా అని ప్రశ్నించారు. గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా.. ఇదేనా మీ రాజకీయమని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details