ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి వేలాదిగా వైకాపా కార్యకర్తలు వెళ్లారన్నారు. పోలింగ్ జరిగే నియోజకవర్గంలో ర్యాలీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు: చంద్రబాబు - tirupati by poll 2021
ఏపీలోని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి వైకాపా నేతలు తరలించారని తెదేపా నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు: చంద్రబాబు
దొంగ ఓటర్లను అడ్డుకున్న తెదేపా నేతల అరెస్టులను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు..? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న తెదేపా నేతలనే అరెస్టు చేస్తారా..? అక్రమంగా అరెస్టు చేసిన తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలి- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి:తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన