తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం ప్రతి అడుగూ చట్ట విరుద్ధమే: చంద్రబాబు

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులు సరికాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తుంటే దాడులు చేస్తారా అని మండిపడ్డారు. ఉపకులపతి ప్రవర్తన దారుణంగా ఉందన్న చంద్రబాబు... విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు.

Nagarjuna University
ప్రభుత్వం ప్రతి అడుగూ చట్ట విరుద్ధమే: చంద్రబాబు

By

Published : Feb 10, 2020, 6:29 PM IST

విజయవాడలోని హెల్ప్‌ ఆస్పత్రిలో ఏఎన్‌యూ విద్యార్థులను తెదేపా అధినేత చంద్రబాబు, ఐకాస నేతలు పరామర్శించారు. విద్యార్థులపై దాడులను చంద్రబాబు ఖండించారు. ఉపకులపతి సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. ఉపకులపతి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, యూనివర్సిటీని స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఉపకులపతి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్​ ఎ.బి. వెంకటేశ్వరవుపై కక్షసాధింపు చర్యలు సరికాదని చంద్రబాబు అన్నారు. అధికారులకు జీతాలు, పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని, సీఎం చెప్పిన పని చేయడమే అధికారుల విధి అయిపోయిందని పేర్కొన్నారు. సీనియర్ అధికారులను సస్పెండ్ చేయడం దారుణమన్న ఆయన...ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రెండు ఎకరాల భూమి కొంటే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మూడు రాజధానులు పెట్టాలని ఎవరు అడిగారని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రతి అడుగూ చట్ట విరుద్ధమే: చంద్రబాబు

విద్యార్థులపై దాడిని ఐకాస నేతలు ఖండించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

ప్రభుత్వం ప్రతి అడుగూ చట్ట విరుద్ధమే: చంద్రబాబు

ఇవీ చదవండి : రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు

ABOUT THE AUTHOR

...view details