తెలంగాణ

telangana

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: చంద్రబాబు - ap news

ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో.. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు తీర్పు... వైకాపా ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదిగా రుజువైందని పేర్కొన్నారు.

ttp, ap
chandrababu, ap news

By

Published : Apr 6, 2021, 10:50 PM IST

ఏపీలో పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచకానికి ఏపీ హైకోర్టు ఉత్తర్వులు చెంపపెట్టన్నారు. ఈ తీర్పుతో తెదేపా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైందిగా రుజువైనట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడాన్ని జగన్‌ ఇకనైనా మానాలని హితవు పలికారు.

ఎస్ఈసీ రబ్బరు స్టాంపుగా కాకుండా.. చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందన్న చంద్రబాబు... కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్న అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details