తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడాది పాలనలో ఎవరికేం ఒరగపెట్టారని ఉత్సవాలు: చంద్రబాబు - Tdp chief Chandrababu fire on jagan

అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే ఏపీ సీఎం జగన్ నట్టేట ముంచారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారని ధ్వజమెత్తారు. వైకాపా ఏడాది పాలనపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రలు సంధించారు.

chandrababu
chandrababu

By

Published : May 30, 2020, 12:31 PM IST

chandrababu

" ఆంధ్రప్రదేశ్​లో వైకాపా పాలన ఏడాది పూర్తయింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి అయినందున 6 నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలనుకున్నాం. కానీ.. తొలిరోజు నుంచే వైకాపా పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు" అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా సాగించారన్నారు.

సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదని... అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా అన్నివర్గాల ప్రజలను వైకాపా ప్రభుత్వం రోడ్డెక్కించిందని ఆరోపించారు.

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత... ఇలా వైకాపా పాలనలో అంతా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు.

ఇన్ని విషాదాల్లో వైకాపా ఏడాది పాలన ఉంటే.. ఏం సాధించారని, ఏం ఒరగబెట్టారని ఉత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధ్యతగా పరిపాలించాలని అన్నారు.

ఇవీ చదవండి:

ఎల్‌జీ కేసులో కమిటీలెన్ని?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details