ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పరిపాలనపై పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సెటైర్లు వేస్తున్నారని బాబు వ్యాఖ్యానించారు. నిన్నమొన్నటి వరకూ కలిసి మెలిసి ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జగన్ పాలనపై కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఇటీవల కేసీఆర్ జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. "ఎగిరెగిరి పడుతున్న జగన్ సత్తా .. ఆరునెలల్లో తెలుస్తుంది" అని కేసీఆర్ మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వాన స్థితికి చేరిందని అందుకే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
జగన్ పాలన ఏంటో కేసీఆర్‌కూ తెలిసిపోయింది: చంద్రబాబు - కేసీఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిపాలన సత్తా ఏంటో కేసీఆర్‌కు కూడా తెలిసిపోయిందంటూ... తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకూ జగన్‌ను వెనకేసుకొచ్చిన కేసీఆర్.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు తెదేపా పార్టీ కార్యకర్తల సమావేశంలో అన్నారు.
జగన్ పరిపాలనా సత్తా ఏమిటో కేసీఆర్‌కు కూడా తెలిసిపోయింది: చంద్రబాబు