తెలంగాణ

telangana

BRS​ పార్టీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

By

Published : Jan 8, 2023, 3:18 PM IST

Updated : Jan 8, 2023, 4:06 PM IST

Pawan Kalyan fire on ycp govt: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్​కు రావడంలో తప్పులేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఏ పార్టీలోనైనా చేరికలు సహజమని.. కొత్తగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్​లోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయిన ఆయన ఏపీలో ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కులు వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan fire on ycp govt: ఏపీలో అరాచక పాలన సాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కులు వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని పవన్ మండిపడ్డారు. ఏపీలో బ్రిటీష్‌ కాలం నాటి జీవో తెచ్చారని.. విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో నం.1కు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబుతో చర్చించామని పేర్కొన్నారు.

ఏపీలో బీఆర్ఎస్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్న పవన్.. ఏ పార్టీలోనైనా చేరికలు సహజమని తెలిపారు. వైసీపీ మంత్రులపై విరుచుకపడిన పవన్ కల్యాణ్.. మంత్రులు అంబటి, అమర్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రంలో సరిగ్గా అమలు కావట్లేదని విమర్శించిన ఆయన.. సంక్షేమ పథకాలు అమలైతే గుంటూరులో రేషన్‌ కిట్‌ కోసం ఎందుకొస్తారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరితే గుంటూరుకు అంతమంది వచ్చేవారా అని పవన్ ప్రశ్నించారు.

"వైకాపా పాచినోళ్లకు అంతకుమించి ఏం మాటలు వస్తాయి. ప్రచార వాహనం ఎవరైనా కొనుగోలు చేస్తారు. వారాహి వాహనం సొంత డబ్బులతో కొనుగోలు చేశాం. సొంత డబ్బులతో కొన్న వాహనంపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో పింఛన్లు తొలగింపు వంటి అంశాలను చర్చించాం. ఏపీలో బ్రిటీష్‌ కాలం నాటి జీవో తెచ్చారు. జీవో నం.1కు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించాం. ఫ్లెక్సీలు నిషేధమన్నారు. జగన్‌ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు పెట్టారు. వాళ్లపై వాళ్లే దాడులు చేసుకునే సంస్కృతి వైకాపాది".- పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

BRS​ పార్టీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

ఇవీ చదవండి:

Last Updated : Jan 8, 2023, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details