CHANDRABABU ON VIVEKA CASE: అబ్బాయే బాబాయ్‌ని చంపాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. వివేకా హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీతో సీఎం జగన్ తలెక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
LOKESH ON VIVEKA MURDER CASE : బాబాయ్‌ని హత్య చేసింది అబ్బాయేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి వెళ్లినందున .. అబ్బాయ్ కూడా చంచల్ గూడ జైలుకి వెళ్తాడని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలి: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ కావడం.. ప్రభుత్వ ప్రతిష్ఠకు, పోలీస్ శాఖకు మాయని మచ్చ అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన అచ్చెన్న.. ఏ మాత్రం నైతికత మిగిలి ఉన్నా ముఖ్యమంత్రి జగన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గొడ్డలి పోటును గుండెపోటుగా మార్పు: వైఎస్ వివేకా హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్.. హంతకుల పక్షాన ఉన్నారని.. ఆ విషయాన్నే వివేకా కుమార్తె సునీతతో పాటు సొంత చెల్లెలు షర్మిల సైతం ప్రకటించారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేయడంపై సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. హత్య కేసులో సాక్ష్యాలు ధ్వంసం చేశారని సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు... తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయాన్ని బహిర్గతం చేసినట్లైందని ఎద్దేవా చేశారు. జగన్ బ్యాచ్ పథకం ప్రకారమే గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చారని విమర్శించారు.
ఇవీ చదవండి: