తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్టీఆర్ ట్రస్టుకు 24 ఏళ్లు పూర్తి.. చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు - తెలంగాణ వార్తలు

ఎన్టీఆర్ ట్రస్టు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

chandra babu naidu wishes to ntr-trust-has-completed-25-years
ఎన్టీఆర్ ట్రస్టుకు 24 ఏళ్లు పూర్తి.. చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు

By

Published : Feb 15, 2021, 7:58 PM IST

ఎన్టీఆర్ ట్రస్టు ప్రారంభించి 24 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు. 1977లో ట్రస్ట్‌ను స్థాపించామని... ఆయన కరుణ లెక్కలేనన్ని జీవితాలకు సేవలందించిందని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలవడమే కాక.. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో సేవలందించి మానవత్వం చాటుకుందని కొనియాడారు. ట్రస్ట్‌తో సంబంధం ఉన్న వారందరికీ ప్రశంసలు తెలియజేశారు.

ఎన్టీఆర్ ట్రస్టు ఇప్పటి వరకు 16 లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసిందని నారా లోకేశ్ పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్ ఆశయాలను ఈ ట్రస్టు ముందుకు తీసుకెళ్తోందని... రక్తనిధి, ఉచిత వైద్య శిబిరాలు, సురక్షిత మంచినీటి సరఫరాలతో ప్రజల ఆరోగ్య సంరక్షణకు, విద్య, జీవనోపాధి కల్పిస్తూ పేదల సాధికారతకు పాల్పడుతోందని చెప్పారు. ప్రకృతి విపత్తులలో దేశవ్యాప్తంగా ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి:సీఎం కుమార్తెను మోసగించిన ముగ్గురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details