తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక హోదా అడగకుండా.. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పాలన కోసం పనిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా అడగకుండా రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో లక్ష కోట్ల సంపదను విధ్వంసం చేశారని దుయ్యబట్టారు.

cbn
ప్రత్యేక హోదా అడగకుండా.. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు: చంద్రబాబు

By

Published : Oct 2, 2020, 10:56 PM IST

కేసుల మాఫీ కోసమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయకుండా ఏపీని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... వైకాపా సర్కార్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో లక్ష కోట్ల సంపదను విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. కుట్రపూరితంగా బీసీల్లో జగన్ చీలికలు తీసుకొచ్చారని చంద్రబాబు విమర్శించారు.

మనం సమాజం కోసం పనిచేస్తే జగన్ వ్యక్తిగతం కోసం పనిచేస్తున్నారు. వైకాపా 17 నెలల పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారు. ఏపీలో భూ కుంభకోణాలు, అక్రమ మైనింగ్ పెరిగాయి. కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్ వర్గం వ్యాఖ్యలు చేస్తోంది. కరోనా తగ్గాక ఏపీ వ్యాప్తంగా ప్రజలను కలిసి కష్టాలు తీర్చేందుకు కృషిచేస్తా. 2022లో జమిలీ ఎన్నికలు వస్తే అందుకు సిద్ధంగా ఉండాలి. పార్టీ కమిటీల్లో యువతకు పెద్దపీట వేస్తున్నాం. నూతన నాయకత్వం గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చాం- చంద్రబాబు, తెదేపా అధినేత

ABOUT THE AUTHOR

...view details